ప్రియమైన నా సమైఖ్యాంధ్ర సోదర సోదరిమణులారా ! మీకో చిన్న విన్నపం,
తెలంగాణా కోరుకునే నాయకులంతా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందుకు విడదీయాలి అనుకుంటునారు? వారు చెప్పేకారణాలు ఇవే కదా?
1. తెలంగాణా ప్రాంతం లో అభివృద్ధి లేదు. కోస్తా,రాయలసీమ ప్రాంతాలు బాగా అభివృద్ధి అయ్యాయి.
2. తెలంగాణా ప్రాంతం లో ఉద్యోగాలు అన్ని తెలంగాణా వాళ్ళకే చెందాలి. కోస్తా రాయసీమ వాళ్ళకు చెందకూడదు.
3. తెలంగాణా రాష్ట్రము తోనే మా ప్రజల ఆర్థిక అసమానతనాలు తొలిగిపోతాయి.
4.తెలంగాణా ని మేమే పరిపాలించుకోవాలి.
ఈ సమస్యలన్నీరాష్ట్ర విభజన తోనే తీరిపోతాయి అనుకొంటే పొరపాటే ,ఎందుకంటే
1. తెలంగాణా ప్రాంతం లో అభివృద్ధి లేదు. కోస్తా,రాయలసీమ ప్రాంతాలు బాగా అభివృద్ధి అయ్యాయి.
కోస్తా,రాయలసీమ ప్రాంతాలు బాగా అభివృద్ధి అయ్యుంటే ,ఈ రోజు Gao,Pune,Mumai వేస్యవాటికల్లో చిత్తూరు జిల్లా ఆడపడుచులు ఎక్కువ మంది ఎందుకు ఉంటారు ?ధనిక జిల్లాలైన శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తిండి దొరకక ,అడవుల్లో బ్రతుకుతూ ,దుంపలు తింటున్నారు?
" ఇది వెనుక బాటు తనం కదా? పేదరికం కదా ?
ఎక్కడ లేదు పేదరికం ?ఎక్కడ లేదు దారిద్యం?"
2. తెలంగాణా ప్రాంతం లో ఉద్ద్యోగాలు అన్ని తెలంగాణా వాళ్ళకే చెందాలి. కోస్తా ,రాయలసీమ వాళ్ళకి చెంధకుడదు.
ఎవరి ప్రాంతం లో వాళ్ళకే ఉద్యోగాలు చేయాలి,బయట వాళ్ళు చేయకూడదు అని ఈ Globalization time లో కూడా అనుకుంటే, Bangalore,Chennai,Pune,Mumai,Delhi లో ఉండే తెలంగాణాsoftware Engineers కూడా resign చేసి తెలంగాణా కి వచ్చేయాలి .విదేశాల్లో ఉండే మన భారతీయులంతా
resign చేసి , భారతదేశాని కి వచ్చేయాలి. ఇది సాధ్యమా ?
" అలా అనుకోవటం మూర్ఖత్వం కదా ?"
3.తెలంగాణ రాష్ట్రము తోనే మా ప్రజల ఆర్ధిక అసమానతలు తొలిగిపోతాయి.
America లాంటి ప్రపంచ ధనిక దేశాల్లో కూడా రాత్రి 8 గంటలు దాటాక బలవతంగా డబ్బులు వసూలు చేస్తూ గాయ పరుస్తూ ఉన్నారే ,మరి ఇది ఆర్ధిక అసమానత వల్లే కాదా ?
పదేళ్ళుగా MLA,MP గా ఉన్నKCR కనీసం కరీంనగర్ లోని ఆర్ధిక అసమానతలు తొలగించాడ ?కనీసం ఆ దిసగా ప్రయత్నం చేస్తునాడా ? పదేళ్ళుగా తన సొంత నియోజకవర్గాన్ని
కూడా అభివృద్ధి చేయలేని వారు రేపు తెలంగాణా ని ఎలా అభివృద్ధి చేస్తాడు అని ఎలా అనుకుంటున్నారు ?
4. తెలంగాణా ని మేమే పరిపాలించాలి.
నాయకుడు ఎప్పుడు ప్రాంతాన్ని బట్టి తయారవుతాడు. స్వాతంత్ర్యం తరువాత గత 60 ఏళ్ళలో ధక్షణ భారతీయులు 6 ఏళ్ళు మాత్రమే ప్రధానమంత్రి గా పనిచేసారు.ఇలా ఆలోచిస్తే ,మనలని మనమే పరిపలించుకోవాలి అనుకుని , ధక్షణ భారతదేశాన్ని భారతదేశం నుంచి విడిపోయి ,ఒక దేశం గా మార్చాలి అనుకోవటం సమంజసమా ?
"ఇది ఎంత నీచపు ఆలోచనో అర్ధం చేసుకోండి ?"
ప్రతిదేశం లోనూ, ప్రతి ప్రాంతం లోనూ ఇలాంటి సమస్యలు ఎప్పుడు ఉంటాయి.KCR,Raj Thakare లాంటి నాయకులూ వీటిని భూతద్దం లో చూపి, అమాయక ప్రజలని రెచ్చ గొడుతూ పబ్బం గడుపుతున్నారు. ఇలాంటివాళ్ళ వల్ల లాభం అస్సలు లేక పోగా ,నష్టమే ఎక్కువ.
Mee Mitrudu
Baratam Krishna Chand
No comments:
Post a Comment